రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు శనివారం రోజు బోథ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా బోథ్ జడ్జి బి హుస్సేన్ మాట్లాడుతూ జీవితంలో చదువుతోనే ఏదయినా సాధ్యమని ప్రతి ఒక్కరు కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచనలు చేస్తూఅదే విధంగా విద్యార్థులు బాల్యం నుండే చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తూ అందులో భాగంగా విద్యార్థులకు బాలకార్మిక నిర్ములన, విద్య హక్కు చట్టం, లైంగిక వేధింపులు, మోటారు వెహికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలు కోర్టు పరిధిలో జరిగే విషయాలు గురించి అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, న్యాయవాదులు రూపేందర్ సింగ్ ఠాకూర్, ఆడెపు హరీష్,కుమ్మరి విజయ్ కుమార్, ఎస్సై సయీద్ ముజాయిద్, ప్రిన్సిపాల్ రాజశేఖర్ మరియు పిసీలు మాల్యాల భూమేష్, విజయ్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on