రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రోజు రాత్రి జర్నలిస్టుపై దాడికి పాల్పడినటువంటి హోంగార్డును పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. మామిడి విజయ అనే హోంగార్డ్ ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడికి దిగడంతో పాటు పోలీసు శాఖ పై , జర్నలిస్ట్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఇచ్చోడ సిఐ నైలు ఉన్నారు.
హోంగార్డ్ తీరుపై జిల్లాలోని పలు బోథ్ జిల్లా రిపోర్టర్లు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.