◾️ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ….
◾️పట్టణంలోని అన్ని సమస్యత్మక కాలనీలలో కవాతు నిర్వహణ…
– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజల విశేష స్పందన, కేంద్ర బలగాలను ఘనంగా స్వాగతించి అభినందించిన ప్రజలు….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ముందుగా యాక్షన్ బలగాలతో సమావేశమై కార్యచరణ ప్రకటించారు. అనంతరం హైదరాబాద్ 91వ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ 80 మంది బలగాలు, జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ పరిపాలన శ్రీనివాసరావు, పట్టణ డిఎస్పి వి ఉమేందర్, ఆర్ ఎ ఎఫ్ డిఎస్పి శశాంక్, కలిసి ర్యాలీని అదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభించి ర్యాలీ వినాయక చౌక్, మసూద్ చౌక్ ఖానాపూర్, బొక్కలగుడ మసీద్, హనుమాన్ మందిరం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ల మీదుగా కొనసాగి ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ముగిసినది. ఖానాపూర్ బొక్కలగుడ కాలనీలో ర్యాలీగా వస్తున్న కేంద్ర బలగాలను స్థానికులు పూలను జల్లి అభినందించారు.

ఆదిలాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొక్కలగుడ, జూనియర్ కళాశాలల నందు విద్యార్థిని, విద్యార్థులకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎటువంటి సమయాలలో విధులను నిర్వర్తిస్తుంది, మత కల్లోలాలు సంభవించినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలు ఎలా వ్యవహరించాలి, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లోకి మహిళల పాత్ర పై, ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని, వివిధ ముఖ్యమైన అంశాలపై అవగాహనను కల్పించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు ఈరోజు నుండి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణం, ఉట్నూర్, బోథ్, నేరడిగొండ, జైనథ్, ఇచ్చోడా లలో వారం రోజులపాటు కొనసాగుతాయని తెలియజేశారు.

జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో శాంతిభద్రతల సమస్యలు లేకుండా ఉండేందుకు ముందస్తుగా ఎటువంటి ర్యాలీలు నిర్వహిస్తుంటారని. ఆర్ఏఎఫ్ శిక్షణలో భాగంగా ఈ ర్యాలీ వారం రోజులపాటు ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల నందు నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన ఎస్ శ్రీనివాసరావు, అదిలాబాద్ పట్టణ డిఎస్పి వి ఉమేందర్, ఆర్ ఎ ఎఫ్ డి ఎస్ పి శశాంక్, ఒకటవ పట్టణ సీఐ కె సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.