- మత్తులో మద్యం కోసం ప్రజల ఇండ్లు తడుతున్న మందుబాబులు
- జనావాసాల మధ్య వైన్స్ లతో జనాలు పరేషాన్..
- ఇంటిలో నుండి బయటకు రావడానికి భయాందోళనలు చెందుతున్న మహిళలు…
ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడేగామ(కే) గ్రామ పంచాయతీ పరిధిలోని వైన్స్ షాపులు జనావాసాల మధ్య ఉండడంతో శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

మద్యం సేవించి మందుబాబులు హల్చల్ చేయడంతో మహిళలు జంకుతున్నారు. మద్యం సేవించిన మందుబాబులు మద్యం మత్తులో మందు కావాలని కాలనీలాలోని ఇన్లలోకి వెళ్లి మద్యం కావాలి అని తలుపులు తడుతున్నరంటే మహిళలు ఎంత భయాందోళన చెందుతున్నారో ప్రజల అర్థం అవుతోంది. రోడ్డు కు ఒక పక్క గుడి , ఇంకో పక్క చర్చి . గుడి , చర్చికి వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనావాసాల మధ్య వైన్స్ లను నెలకొల్పడానికి గ్రామపంచాయతీ పర్మిషన్ ఇవ్వకున్న కూడా వైన్ షాపులు నెలకొల్పడం ఏంటి అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..?
వెంటనే ఈ వైన్స్ లను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని లేని ఎడల పెద్దఎత్తున ధర్నా చేపడతామని కాలనీవాసులు పేర్కొన్నారు.
