◾️హత్ సె హత్ జోడయాత్రతో గ్రామాలలో పర్యటన
రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి:బీఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వమని,
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు దొంతి
మాధవరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన
హామీలను అమలు చేయకుండా
ప్రజలను మోసం చేస్తున్నారని
మండిపడ్డారు. హాత్ సే హత్ జూడో
యాత్రలో భాగంగా నేడు 6వ రోజు కొండైలుపల్లి, నల్లబెల్లి, లేంకాలపల్లి గ్రామాలలో ఉదయం 8 గంటల నుండి
మధ్యాహ్నం వరకు పాదయాత్ర
కొనసాగింది. తొలుత మహిళలు పెద్ద ఎత్తున వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర
కొనసాగిస్తూ పాదాచారులను,
రైతులను, పొలాల్లో కూలీలను
పలకరిస్తూ వారి సమస్యలు వింటూ,భరోసానిస్తూ గ్రామాల్లోకి చేరుకొని
గ్రామ కూడలిలో ప్రజలను ఉద్దేశించి
మాట్లాడుతు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ కల్పించి దళిత, బడుగు, బలహీన గిరిజన జాతులు ఉన్నత విద్యను అభ్యసించుటకు కృషి చేసిందన్నారు. నేడు టీఆర్ఎస్, బీజెపీప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలే తప్పా, ఏ ఒక్క వాగ్దానం
నెరవేర్చలేదని దుయ్యపట్టారు. లంబాడీలకు 12 శాతం
రిజర్వేషన్ కల్పిస్తానని, పోడు భూములకు పూర్తిస్థాయిలో
పట్టాలిస్తానన్న కేసీఆర్ నేడు మెలిక పెడుతూ పోడు రైతులను వంచన చేస్తున్నాడని మండిపడ్డారు. ధరణి పేరుతో దళిత, గిరిజన, లంబాడీల భూములను లాక్కునే ప్రయత్నంలోనే టీఆర్
ఎస్ ప్రభుత్వం ఉందని, పేదవాడికి కనీసం గూడు కట్టించలేని అసమర్ధ ప్రభుత్వమని విమర్శించారు. రైతులు పండించిన పంటలను తగు సమయంలో కొనుగోలు చేయకుండా అరిగోస
పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బస్తా ధాన్యానికి
తరుగు పేరుతో నాలుగు కిలోలు దోచుకుంటున్నారని
దుయ్యబట్టారు.

గత సంవత్సరం జనవరిలో వడగళ్ల వానతో
నర్సంపేట నియోజకవర్గంలోని మిర్చి, మొక్కజొన్న పంటలు
దాదాపు 16 వేల ఎకరాల్లో కొట్టుకపోయి నష్టం జరిగితే
ఎమ్మెల్యే పెద్ది వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ
శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సైతం వెంట పెట్టుకొచ్చి
పరిశీలన చేసి పేపర్ పోజలు కొట్టారు తప్ప ఒరగపెట్టింది
ఏమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు
రెండు లక్షల రుణమాఫీతో పాటు పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చిందన్నారు. రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలతో పాటు పనిముట్లు, ఉచిత విద్యుత్తు ఇచ్చామని గర్తుచేశారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేశామని కాంగ్రెస్ పాలనను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.