రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ప్రధానితో పార్లమెంట్ పరిధిలోని పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించాలని కోరారూ. దీనికోసం ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించానని అన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్- 2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని మోడీ కోరానట్లు, అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని.. పెరిగిన రద్దీ గురించి, జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు.
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విన్నవించానని అన్నారు.
భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని రహదారుల పునరుద్ధరణ గురించి ప్రధానితో చర్చించి, మూసీనది ఆయకట్టు ప్రాంతం కింద ఉన్న గ్రామాల రోడ్ల అనుసంధానం, కొత్త రహదారుల నిర్మాణం అవసరంపై వివరించానని అన్నారు.

హెచ్‌ఎస్‌ఎస్ పథకం కింద తెలంగాణకు కేవలం 20 ఆసు యంత్రాలను మాత్రమే కేటాయించారు. ఇవి సరిపోవని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. కనీసం 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని కోరానని
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో చేనేత కార్మికులు సాంకేతికత విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. డిజైన్ అభివృద్ధి, మార్కెట్ ట్రెండ్ లకు అనుగుణంగా, ఆధునిక యంత్రాల సౌకర్యాలు లేవు. వాటిపై దృష్టి పెట్టి సమకూర్చాలని విన్నవించారూ.
Narendra Modi