ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారనే వార్త వినిపిస్తున్నా తరుణంలో కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు
రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ లో బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ మహిళల సమస్య కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం అన్నారు. ఈ సందర్బంగా ఎర్పాటు చేసిన ప్రెస్మిట్ లో మాట్లాడుతు
సారాయి అంటేనే మహిళల గౌరవం కుటుంబం విచ్చినం చేసేది, అలంటిది సారాయి మహిళల గౌరవాన్ని దెబ్బతిసే సారాయి వ్యాపారం చేసిన తెలంగాణ మహిళల పరువు తీసే వారికి, తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టె వారికి తెలంగాణ మహిళకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఒక పక్క సారాయి తో మహిళల జీవితాన్ని చిన్నభిన్నాం చెసే వ్యాపారం చేసి మరోపక్క మహిళల రిజర్వేషన్ కోసం పోరాటం చేయటం హాస్యాస్పదం గా ఉందని అన్నారు.
సారాయి అంటేనే మహిళలపై హింసకు మరో రూపంమని అన్నారు. మహిళలపై హింసకు మూల కారణమైన సారా వ్యాపారాన్ని విస్తరించే వాళ్ళు ఢిల్లీ వెళ్లిన వారి కోసం పోరాటం చేయడం ఎందని ప్రశ్నించారు.
ఆ స్కామ్ అవినీతికి సంబంధించిన అంశం కూడా కాదు, అది రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నటువంటి వ్యవహారంమని అన్నారు.
కచ్చితంగా అది తెలంగాణ మహిళల సమస్య కానేకాదు