రిపబ్లిక్ హిందుస్థాన్ , నేరేడుచర్ల : మున్సిపాలిటీలోని విద్యానగర్ కు చెందిన దాసోజు రమణాచారి అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల కింద మరణించారు వారి పిల్లల విద్యా ఖర్చుల నిమిత్తమైలయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల పూర్వ అధ్యక్షులు పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి 40 ,000 రూపాయలు మరియు పూర్వాధ్యక్షులు బట్టు మధు రూ.10 వేలు మొత్తం రూ.50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో పో రెడ్డి శ్రీరామ రెడ్డి మాట్లాడుతూ మ మంచిగా చదువుకొని భావి జీవితానికి మంచిగా పునాదులు వేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షులు యడవెల్లి సత్యనారాయణ రెడ్డి, చాప్టర్ ప్రెసిడెంట్ సీతారాం రెడ్డి , కార్యదర్శి చల్లాప్రభాకర్ రెడ్డి , కోశాధికారి రామస్వామి, డైరెక్టర్లు కర్రీ సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ ,మరియు సభ్యులు రంగారెడ్డి, లక్ష్మారెడ్డి ,విశ్వనాథం, కీతకనకయ్య తదితరులు పాల్గొన్నారు
లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
Recent Comments
Hello world!
on