విధుల నుండి సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
▪️విధుల నందు నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవు▪️బందోబస్తులో మద్యం సేవించి విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్
▪️ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవమని జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం బందోబస్తు నందు అర్ గణపతి అనే కానిస్టేబుల్ కు విధులు కేటాయించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తూన్న సమయం లో మద్యం సేవించి ఉండటాన్ని గమనించిన బజార్హత్నూర్ ఎస్ఐ వైద్య పరీక్షలకు పంపగా, వచ్చిన రిపోర్ట్ ఆధారంగా జిల్లా ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వుల జారీ చేయడం జరిగింది. బజార్హత్నూర్ పట్టణంలో బందోబస్తు విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ అర్ గణపతి పై ఈరోజు జిల్లా ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.