ఆటగాళ్ల భద్రత ముఖ్యం : బిసిసిఐ
మాంచెస్టర్ లో ఇంగ్లండ్ మరియు భారత్ ల మధ్య జరిగే చివరి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోవిడ్ -19 కారణంగా రద్దయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత జట్టు కరోనా కారణంగా ఆటను కొంసాగించలేదు. మరింత కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది . ఆట కంటే ముందు భారతీయ క్రికెటర్ల ఆరోగ్యం భద్రత ముఖ్యమని అన్నారు. మొదటి ప్రాధాన్యత వాటికే అని బిసిసిఐ పేర్కొన్నది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ , సెప్టెంబర్ 10 శుక్రవారం నాడు ఇలా పేర్కొంది: బీసీసీఐ తో కొనసాగుతున్న సంభాషణల తరువాత, ఈరోజు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ మరియు ఇండియా మెన్ మధ్య ఐదవ టెస్ట్ రద్దు చేయబడుతుందని పేర్కొన్నారు.
“జట్టు లోపల కవిడ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందనే భయాల కారణంగా, భారత క్రికెట్ బోర్డ్ జట్టును ఆటకు అనుమతి ఇవ్వలేదు..
“ఈ వార్త కోసం మేము అభిమానులు మరియు భాగస్వాములకు మా హృదయపూర్వక క్షమాపణలు పంపుతున్నాము, ఇది చాలా మందికి తీవ్ర నిరాశ మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుందని మాకు తెలుసు.” అని రెండు దేశాల క్రికెట్ బోర్డులు క్షమాపణ లు కోరాయి.