రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ జిల్లా : ఖానాపూర్ పట్టణంలోని మదిన పాల కేంద్రంలో రెండు నకిలీ నోట్లు, ఓ రెగ్జిన్ వర్క్ షాప్ లో మరో నకిలీ నోటు ఇలా రెండు షాపులలో ఒకే నంబర్ 4KS 249393 గల రెండువందల రూపాయల మూడు నోట్లు లభ్యమయ్యాయి.. వ్యాపారులు బుధవారం రోజు ఉదయం కౌంటర్ చూసుకోగా అనుమానం వచ్చి అసలు నోటు కు నకిలీ నోటుకు తేడా చూసి గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు షాపుల వద్దకు చేరుకొని విచారణ చేస్తున్నారు. వ్యాపారంలో ఎవరూ ఇచ్చారో తెలియదని వ్యాపారులు తెలుపుతున్నారు.
ఇంకా పట్టణంలో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి నోట్లు ఇంకా ఉన్నాయేమోనని ప్రజలు అప్రమత్తంగా ఉండి నోట్లు తీసుకునే టప్పుడు చూసుకోవాలని వ్యాపారస్తుడు తెలుపుతున్నాడు.
