రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరింత దిగజారుడు రాజకీయానికి తెరతీసింది. చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఫేక్ వాయి్‌సతో ఐవీఆర్‌ఎస్ సర్వే అంటూ టీడీపీ నాయకులకు వాయిస్ మేసెజ్‌లు పంపింది. మార్కాపురం టీడీపీ అభ్యర్థిపై వ్యక్తిగత అభిప్రాయం సేకరిస్తున్నట్లు గురువారం బాబు వాయి్‌సతో టీడీపీ నాయకులకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.
టీడీపీ అభ్యర్థిగా చింతలచెరువు సత్యనారాయణపై మీ అభిప్రాయం తెలియజేయడంటూ వచ్చాయి. ఆ అభిప్రాయాన్ని ఒకటి నొక్కడం ద్వారా బలపరచాల్సిందిగా ఫోన్ సందేశం వచ్చింది. నోటా అయితే రెండు నొక్కండి అనే వాయిస్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.
ఆ తరువాత కొంతసేపటికి అవి ఫేక్‌కాల్స్ అని స్పష్టమైంది. వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని జిల్లా ముస్లీం మైనారిటీ నాయకులు రసూల్, జిల్లా టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ కార్యదర్శి గౌస్ తదితర టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు.