ఈరోజు మున్సిఫ్ కోర్టు నందు లొంగిపోయిన ప్రధాన నిందితులు
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
పోలీసు కస్టడీ కోసం ఫైల్ దరఖాస్తు
ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత నెల 25వ తారీఖున ఆదిలాబాద్ పట్టణం నందు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల తయారు కేంద్రాన్ని నెలకొల్పి, రైతులను మోసగించే ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ క్రమంలో నిందితుల వద్ద నుండి దాదాపు 500 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మరియు వాటి విలువ 19 లక్షలు గా ఉంటుందన్నారు. ఈ క్రమంలో వారికి బెల్ లభించడంతో, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా సెషన్స్ కోర్టు నందు రివిజన్ ఫైల్ చేయగా, వాదనలు విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు గారు బెయిల్ ను రద్దుచేసి మూడు రోజుల్లోగా లొంగిపోవాలని తెలియజేశారు. అందుకుగాను ఈరోజు
A 1) సామ అశోక్ రెడ్డి.
A 2) రాజేందర్ లు మున్సిఫ్ కోర్టు నందు లొంగిపోవడం జరిగింది వారికి కోర్టు వారు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించడం వల్ల జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మహారాష్ట్రలోని జాల్న, కర్ణాటక, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో గల ఆఫీసుల నందు తనిఖీలు నిర్వహిస్తూ విచారించేందుకు జిల్లా పోలీసులు తరఫున ప్రధాన నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీని కోరడం జరుగుతుందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నేరానికి పాల్పడినటువంటి నిందితులకు ఆశ్రయమిచ్చిన షాపుల ఓనర్ కు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోడౌన్ ను ఎమ్మార్వో సమక్షంలో స్వాధీనం . చేయడం జరిగిందన్నారు.
నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on