రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: కొత్తగా పోడు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ లెక్కచేయకుండా అడవిని నరికి పోడు చేస్తున్న కొందరిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపూర్ శివారులో అక్రమంగా అడవిని నరికి కొత్తగా పోడు చేస్తున్నారని ఎఫ్ ఆర్ ఓ కమిటీ సభ్యులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ కమిటీ సభ్యులతో, కొత్తగా పోడు చేస్తున్నటువంటి ఎర్ర చెరువు తండా కు చెందిన బానోతు లచ్చు, భూక్యా రామ్ సింగ్ లతోపాటు 20 మంది వాగ్వివాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో బీట్ ఆఫీసర్ శోభన్ ఎఫ్ ఆర్ వో రమేష్ కు సమాచారం అందించగా ఆయన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. అడవిలోని ఒక చెట్టును కొట్టిన ఉపేక్షించేది లేదని వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ కేసులు సైతం పెడతామని హెచ్చరించారు. అనంతరం పోడు చేస్తున్నటువంటి విషయాన్ని సమాచారం అందించినటువంటి ఆర్ఓఎఫ్ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
గోవిందాపురంలో నూతన పోడు అడ్డుకున్న బీట్ ఆఫీసర్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on