🔶 కూతురికి కరెంట్ షాక్ తగలడంతో కాపాడబోయి..
🔶 ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
🔶 కామారెడ్డి పట్టణంలో విషాదఛాయలు
రిపబ్లిక్ హిందుస్థాన్ ,కామారెడ్డి: జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న హైమద్ (35) కు పర్వీన్(30),కుమారుడు అద్నాన్ (4),కూతురు మాహిమ్(6) ఉన్నారు. ఆరేసిన బట్టలు తొలగిస్తున్న క్రమంలో మహిమ్ కు విద్యుత్ షాక్ తగలడంతో నివారించేందుకు యత్నించిన మిగతా వారికి షాక్ తగిలి కుటుంబంలో నలుగురు మృతి చెందారు.
దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సర్కారు దవాఖానకు తరలించారు. కాగా ఈ సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ గంప గోవర్దన్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేసిఆర్ ఆర్ధిక సహాయం ప్రకటించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కాగా కలెక్టర్ జితేష్ పాటిల్, విప్ గంప గోవర్దన్ లు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటనా స్థలం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. తక్షణ సహాయం కింద గంప గోవర్దన్ 25 వేల నగదును అందజేశారు.