◾️గౌడ కులస్తులపై వివక్షత చూపుతున్న కెసిఆర్ ప్రభుత్వం…
◾️తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న గీత కార్మికులు….
◾️మోకు దెబ్బ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులను అవమానించిందని, రాష్ట్ర ప్రభుత్వం అందజేసేరూ, లక్ష ఆర్థిక సాయం అందజేసే జాబితాలో గౌడ కులస్తులను చేర్చకపోవడం ఆంతర్యం ఏమిటని మోకు దెబ్బ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గౌడ కులస్తులు బీసీ కులాల్లో లేరా. ..? గౌడలు కుల వృత్తికి పనికిరారా తెలంగాణ ప్రభుత్వం కులగజ్జితో కులాలను విడదీసి కొన్ని కులాలు అవహేళన చేస్తూ రాజకీయం పబ్బం గడుపుతున్నారని వృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అందులో గౌడ కులస్తులను చేర్చకపోవడం బాధాకరమని అన్నారు.

ప్రాణాలను సైతం గుప్పిట్లో పెట్టుకొని ఆకాశమంత చెట్టుపై ఎక్కి కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి జీవితంతో పోరాడే వ్యక్తి రాష్ట్రంలో దేశంలో ఏకైక వ్యక్తి గౌడ్ అన్న అలాంటి వ్యక్తికి బతికున్నప్పుడు లేని ఎక్స్గ్రేషియా చనిపోగానే ఎక్స్గ్రేషియా ఇవ్వడం ఎందుకు..? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం ఉన్న గౌడ కులాన్ని ఎందుకు పరిగణంలోకి తీసుకో లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. లక్ష రూపాయల సహాయం అందించే కులాల జాబితాలో వెంటనే గీతా కార్మికుల కులాన్ని చేర్చి ఉత్తర్వులు జారీ చేయాలని అప్పటివరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర్వులు జారీ చేయకుండా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గౌడ కులస్తులు ఏకమై నిరసన కార్యక్రమాలు చేపడతారని ఆయన అన్నారు.

తక్షణమే గీతా బందు ప్రకటించాలి
సహచరిని పిల్లలను సైతం పక్కనపెట్టి గీత వృత్తే నిరంతర దినచర్యగా చేస్తూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి జీవిస్తున్న గౌడ కులస్తులను తెలంగాణ ప్రభుత్వం వస్తే ఆదుకుంటుందని ఎంతో భరోసాగా ఉన్న గౌడ లను కించపరుస్తూ కేసీఆర్ ప్రభుత్వం కులాలను సైతం విడదీసి పాల చేస్తున్నారని ఆయన ఆవేద వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గీతా బందు ఏర్పాటు చేసి గౌడ కులస్తులను ఆదుకోవాలని అన్నారు. —గీతా కార్మికుడు కోయల వీరన్న