
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : బోరజ్ చెక్ పోస్ట్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బంగారు పుస్తెలా తాడును ఓ వ్యక్తి దొంగలించి పారిపోయే క్రమంలో మహిళ అరుపులతో అప్రమత్తమైన తోటి ప్రయాణీకులు మరియు దొంగ పారిపోతున్నిప్పుడు బయటి వ్యక్తులు గమనించి దొంగను పట్టుకున్నారు. దొంగలించిన బంగారు గొలుసు విలువ సుమారు 2 లక్షల 50 వేల వరకు ఉంటుంది. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


