మహిళా నిరుద్యోగులకు లాభం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి.ఇందుకు గాను ప్రత్యక్ష నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వుడ్ కేటగిరీల్లో 33 శాతం, 1/3 రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం అన్ని బోర్డులకు ఆదేశించింది. దీంతో ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. కాగా మహిళా రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో ఈ రోజు గురుకుల ఫలితాలు విడుదల కాగా.. టీఎస్ పీఎస్సీ, ఇతర బోర్డుల ద్వారా నిర్వహించిన వివిధ ఉద్యోగాల ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on