నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ యూస్ చేస్తుంటారు.
ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్న లేదా సమాచారాన్ని అన్వేషించాలన్న వెంటనే మొబైల్ ఆన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాము. అయితే మనకు తెలియకుండానే గూగుల్ మనం మాట్లాడే మాటలను వింటుందని మీకు తెలుసా ? అవునండి. మనం మాట్లాడే ప్రతి మాటలు, మొబైల్ లో వెతికే ప్రతి సమాచారం గూగుల్ ట్రెస్ చేస్తుందట. ఉదాహరణకు మనం మొబైల్ లో ఏదైనా వస్తువు గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ తర్వాత మొబైల్ లో బ్రౌజ్ చేసేటప్పుడు మనం వెతికిన వస్తువుకి రిలేటెడ్ గా యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. .
ఈవెన్ మనం ఫోన్ లో ఏ ఏదైన వస్తువు గురించి డిస్కషన్ చేసిన ఆ వస్తువు తాలూకు యాడ్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలామంది దీనిని గమనించే ఉంటారు. మరి మనం ఎలాంటి అనుమతి ఇవ్వకుండా ఇదెలా సాధ్యం అనే సందేహాలు కూడా చాలమందికి వచ్చే ఉంటాయి. నిజానికి మొబైల్ లో ఇన్ స్టాల్ అయిన ప్రతి అప్లికేషన్ కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ పర్మిషన్ అన్నిటికి మనం యాక్సస్ ఇవ్వడం వల్ల మొబైల్ లోని మైక్రోఫోన్, మీడియా, కాంటాక్ట్స్.. వంటి సున్నితమైన సమాచారాన్ని ఆ యాప్స్ కు మనమే అనుమతి ఇచ్చినట్లవుతుంది.
కాబట్టి మనం యూస్ చేసే అప్లికేషన్ కు ఏ ఏ అనుమతులు అవసరమో వాటికి మాత్రమే యాక్సస్ ఇచ్చి మిగతావి ఆఫ్ చేసుకోవాలి. అందుకోసం మొబైల్ లోని సెట్టింగ్స్ ఆన్ చేసి యాప్స్ లోకి వెళ్ళాలి అక్కడ మన మొబైల్ లో ఇన్ స్టాల్ అయిన ప్రతి అప్లికేషన్ కనిపిస్తుంది. అక్కడ ఏ ఏ యాప్స్ కు ఎలాంటి అనుమతులు ఇచ్చామో చెక్ చేసుకొని అనవసరంగా మైక్రోఫోన్, కాంటాక్ట్స్, మీడియా వంటివాటికి యాక్సస్ ఉంటే వెంటనే యాక్సెస్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం సేఫ్ గా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.