గుట్కా ఒక యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. తన భార్య వేరే వ్యక్తి నుంచి గుట్కా తీసుకుందని, అసూయపడిన భర్త తన గొంతు, మణికట్టును కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ బేతల్ జిల్లాలో గౌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మనోజ్ (35) తన భార్య పూజతో కలిసి నివసిస్తున్నాడు. ఇతను ఝల్లార్ వాసి. గత మూడేళ్లుగా బేతుల్‌లో ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాడు. ఆదివారం శివరామ్ భార్య పూజ తన పొరుగింటి వ్యక్తి నుంచి గుట్కా(పొగాకు) అప్పుగా తీసుకుంది. ఈ విషయం తెలిసిన మనోజ్ తన భార్య తనను గుట్కా అడగకుండా.. వేరే వ్యక్తిని అడగడంపై భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం ఎక్కువ అవ్వడంతో శివరామ్ ఆవేశంలో గొంతు, మణికట్టును బ్లేడ్‌తో కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రక్షించి అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు.
దంపతులిద్దరిది ప్రేమ వివాహం అయినప్పటికీ.. తరుచూ గొడవ పడేవారని తెలుస్తోంది. పూజ పొరుగింటి వారి నుంచి గుట్కా అడగడం అతనికి నచ్చలేదు. తాగి ఇంటికి వచ్చిన అతను తన భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవ పెద్దది కావడంతో పూజ సోదరుడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే 15 నిమిషాల ముందు మనోజ్ గొంతు, మణికట్టును కోసుకున్నాడు.
గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోజ్‌ని భోపాల్ రిఫర్ చేసేందుకు వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు.