రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : అదిలాబాద్ జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి ఇచ్చోడ జిపి సర్పంచ్ చౌహన్ సునీత కు అవమానం ఎదురైందా..!?
ఇచ్చోడ మండల కేంద్రంలో కొన్ని భవనాల పై వచ్చిన ఫిర్యాదుల పై విచారణ కోసం డిఎల్పీఓ ధర్మరాణి వచ్చిన సందర్భంగా సర్పంచ్ తండ్రి అన్ని తానై విచారణ అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నట్లు గా వీడియో ఒకటి వైరల్ అయింది. అదే సమయంలో సర్పంచ్ ఛాంబర్ లో ఉన్న సర్పంచ్ కుర్చీలో డిఎల్పీఓ కూర్చోగా, ఆ పక్కన కూడా సర్పంచ్ ని కూర్చో బెట్టకుండా ఎంపిఓ అటు పక్కన సర్పంచ్ తండ్రి టేబుల్ పక్కన కూర్చుని ఉన్నారు. సర్పంచ్ కు సాధారణ కుర్చీలో అందరితో పాటు పక్కన కూర్చోబెట్టినట్లుగా వీడియో లో కనిపిస్తుంది.
వీడియో లో ఎంపిఓ రమేష్ , పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాష్ , సర్పంచ్ తండ్రి దేవానంద్ లు కనిపిస్తున్న దృశ్యాలు చూడవచ్చు.