కామారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డిలో జిల్లా గాంధారి మండలం గుజ్జులు తండాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుకు గురి కావడంతో మండలకేంద్రంలోని ఎస్వీజి నర్సింగ్ హోంకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.
గుండెపోటు పేషంట్ కు చికిత్స అందించేందుకు డాక్టర్ లక్ష్మణ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. పేషంట్ ను వైద్య పరీక్షలు అందిస్తున సమయంలో డాక్టర్ సైతం గుండె పోటుకు గురయ్యాడు. చికిత్స అందిస్తున్నా డాక్టర్ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరోవైపు చికిత్స కోసం వచ్చిన పేషంట్‌ను హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించారు. అయితే ఆ పేషంట్ కూడా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
దీంతో ఆసుపత్రికి పేషంట్ తోపాటు చికిత్స అందించడానికి సిద్ధమైన డాక్టర్ కూడా మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మీడియా కథనాల ప్రకారం వైద్యుడు లక్ష్మణ్ గతంలో గుండెపోటు తో రావడంతో రెండు స్టెంట్స్ వేసుకున్నట్లు సమాచారం. డాక్టర్ వైద్యం అందించే ఆసుపత్రిలో నే కుప్పకులడంతో అక్కడ విషాదకర వాతావరణం ఏర్పడింది.