షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ద్వారా SC విద్యార్థిని, విద్యార్థులకు కృషల్ వెల్ఫేర్ ఫండ్ క్రింద మంజూరు చేయబడిన ల్యాప్ టాప్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రతీక్ (IIT,తిరుపతి), శ్రేయ, వంశీ (NIT, వరంగల్), సుమిత్ (IIIT, బాసర) ఇంజనీరింగ్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ, బాగా చదివి మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. తల్లిందండ్రులను మర్చిపోకుండా వారికి, జిల్లాకు మంచి పేరును తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఫోన్ లను, ల్యాప్ టాప్ లను మంచి విషయాలకు, చదువుకు సంబంధించిన వాటికీ మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా కృషియల్ వెల్ఫేర్ ఫండ్ క్రింద, తల్లిందండ్రుల ఆదాయం 5 లక్షలు ఉన్నవారు అర్హులని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారిని బి. సునీత కుమారి, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ADB : విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేత
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on