గుడిహత్నూర్: గురువారం తెల్లవారు జామున 5గం,సమయం లో గుడిహత్నూర్ బుద్ధ కాలనీ, సమీపంలో బై పాస్ రోడ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది.

అతి వేగంగా వస్తున్న లారీ, TS01Z 0143 నెంబర్ గల సూపర్ లగ్జరి బస్సును వెనుక వైపునుండి ఢీ కొట్టింది బస్సు వెనుక వైపు ప్రయాణికులు లేనందువల్ల పెద్ద ప్రమాదమే తప్పింది,ప్రయాణికులు సురక్షితం. బస్సు వెనుక భాగం పాక్షికంగా దెబ్బతిన్నది,కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తామని గుడిహత్నూర్ ఎస్.ఐ తెలిపారు.