మూత్రం అంటేనే మనం అందరం ఒక రకంగా చూస్తాం. అది మన శరీరం నుంచే వచ్చినా.. దాన్ని మాత్రం ఏదో వింత లాగా పరిగణిస్తాం. అయితే అదే మూత్రం ఇప్పుడు మనకు వెలుగులను ఇవ్వనుంది.
అదేంటీ మూత్రం వెలుగులు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా. అదే మ్యాజిక్ మరి. మూత్రం నుంచి కరెంట్ తయారు చేసే విధానాన్ని ఐఐటీ పరిశోధకులు కనిపెట్టారు. మూత్రం నుంచి విద్యుత్‌తోపాటు జీవ ఎరువును ఉత్పత్తి చేయవచ్చని నిరూపించారు. పునరుత్పాదక ఇంధనాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు తోడు ఉన్న సహజ వనరులు అడుగంటిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.