*విగ్రహాలు , హుండీలోని నగదు తో ఉదయించిన దొంగలు
* ఇచ్చోడలో జరుగుతున్న వరుస చోరీలతో భయాందోళనలో ప్రజలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది . సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం .. ఇచ్చోడలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి నగదు , విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు . ఎప్పటిలాగే ఉదయం పూజకి వెళ్లిన స్వాములు చూడగా ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు . వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు . ఆలయంలోని సుమారు రూ . లక్షా 20 వేలు విలువ చేసే 3 ఉత్సవమూర్తుల విగ్రహాలు , ఒక గంట , పూజారికి చెందిన రూ .10 వేల నగదు మరియు హుండీలోని నగదు చోరీ అయినట్లు గుర్తించారు . విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు . క్లూస్ టీం తో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు .

ఇచ్చోడ మండల కేంద్రంలో రెచ్చిపోతున్న దొంగలు …
ఇచ్చోడ మండల కేంద్రంలో ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల క్రితం నూతనంగా ప్రారంభించిన వైన్స్ దుకాణాల్లో దొంగతనం జరిగింది.
గతం లో ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగింది. కొన్ని చోట్ల ప్రజల అప్రమత్తం వల్ల దొంగలు పారిపోయిన ఘటనలు జరిగినయి. తాజాగా ఇప్పుడు ఏకంగా అయ్యప్పస్వామి స్వామి ఆలయలో దోంగలు పడ్డారు. ఎవరి వైఫల్యంమో గాని దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.