రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్ డబ్యుఎస్ అధికారులను జిల్లా పాలనాదికారి రాజర్షి షా ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎండాకాలంలో ఎక్కడ త్రాగునీటి సమస్య రాకుండా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హ్యాండ్ పంప్, పుంపు సెట్ రిపేర్లు చేసి వాటి వాడుకలోకి తీసుకురావాలని, మిషన్ భగీరథ లీకేజ్ లను మరమ్మత్తు చేయాలనీ సూచించారు. అవసరమైన చోట కొత్త పైపులు, హౌస్ హోల్డ్ కనెక్షన్ లు అందించి నీరు సరఫరా పూర్తిగా జరిగేటట్టు చూడాలని సూచించారు. భగీరథ నీరు వెళ్ళని చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
మరమ్మత్తు పనులకు గ్రామపంచాయితీ నిధులను ఉపయోగించాలని, ఎక్కడెక్కడ రిపేర్ అవసరమో. ఆ పనులన్నీ మార్చ్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో సాయన్న, సీఈఓ , డిపిఓ శ్రీలత, మిషన్ భగీరథ ఎస్.ఈ సురేష్, మున్సిపల్ కమీషనర్ ఖమర్ అహ్మద్, AES RWS, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.