అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
— నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతా రానున్న 48 గంటల్లో జోరుగా వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో నియోజకవర్గంలో పలుచోట్ల వాగులు, వరద నీటితో పోటెత్తుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ పోలీస్ విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ రెండు రోజులు ఉద్యోగులు ఎవరు సెలవులపై వెళ్లొద్దని అన్నారు. నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో సహాయక చర్యలో పాల్గొనాలని సూచించారు.