శ్రీ పొట్టి శ్రీరాములు – నెల్లూరు జిల్లా : జిల్లాలో డయల్100 కాల్ పై స్పందించి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సంతపేట పోలీసులు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆనకట్ట దగ్గర పెన్నా నీరు ఆపి ఉన్న అడ్డుకట్ట తెగిపోవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో నెల్లూరు టౌన్ రంగనాయకుల పేట పరిసర ప్రాంతంలో మత్స్యకారులు, పశువుల కాపరులు చిక్కుకున్నారు .

ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో రంగనాయకుల పేట సమీపంలో నిర్మిస్తున్న పెన్నా బ్రిడ్జి దగ్గర నీటిని ఆపుటకు కట్టిన కట్ట అకస్మాత్తుగా తెగిపోవడంతో, దిగువన ఉన్న మత్స్యకారులు, పశువుల కాపరులు ముగ్గురు నీటిలో కొట్టుకొని పోతుండడంతో, వెంటనే వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.


వెంటనే స్పందించిన పోలీసు యంత్రాంగం వారికి సహాయక చర్యలు టౌన్ డి.యస్.పి. ఆధ్వర్యంలో సంతపేట పోలీసులు, స్థానికుల సహకారంతో వారిని నీటిలో నుండి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
నిమిషాలలో స్పందించి ప్రాణాలు కాపాడినందుకు అక్కడి ప్రజలు మరియు వరదల్లో చిక్కుకున్న వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల బంధువులు, ప్రజలు మెచ్చుకోగా, ఉన్నతాధికారులు అభినందించారు.