◾️అపరిశుభ్రంగా గ్రంధాలయ ఆవరణం
◾️చిందరవందరగా ఆవరణంలో మందు బాటిల్స్ ప్రత్యక్షం
◾️నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంచార్జ్
◾️ పట్టించుకోని ఉన్నతాధికారులు

రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ కార్యాలయం అతి సమీపంలో ఉన్నా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పవిత్రంగా భావించే గ్రంథాలయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించడం, పొగ త్రాగటం జూదం ఆడడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో గ్రంథాలయ ఆవరణంలో మద్యం సేవిస్తున్నారు. దీంతో రోజు గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గ్రంథాలయాన్ని నిర్వహించాల్సిన ఇంచార్జ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్నహం.

గ్రంధాలయ ఆవరణ మొత్తం
గ్రంథాలయ ఆవరణం మొత్తం చెత్తాచెదారం మద్యం బాటిల్స్ తో నిండిపోయింది. గ్రంథాలయానికి ఇన్చార్జిగా ఉన్న వ్యక్తి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మండల ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, గ్రంధాలయ ఇన్చార్జ్ సక్రమంగా నిర్వహించకపోవడంతో మందుబాబులు దీనినీ ఆసరాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకుడి పై చర్యలు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.