నల్లబెల్లి :
మానవత్వం మర్చిపోయి సోంత తమ్ముడిని హత్య చేసి చంపిన దారుణ సంఘటన నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన కుండే కుమారస్వామిని అతని అన్న కుండే రవి శనివారం రాత్రి కత్తితో కుమారస్వామి మెడపై దారుణంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇద్దరు గోడవ పడి కుటుంబ తగాదాలతో ఒకరినోకరు కోపానికి గురైన అన్న తమ్ముడిపై గోడ్డలితో దాడి చేశాడు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న నల్లబెల్లి ఎస్ ఐ నైనాల నగేష్ ఘటన స్థలానికి చేరుకోని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు తెలిపారు.
మృతుని తండ్రి మొండయ్య తల్లి ఐలక్క. హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది.