◾️ఆవరణంలో పసుపు కుంకుమ, నిమ్మకాయలు చూసి భయభ్రాంతులకు గురైన విద్యార్థులు
◾️బాధితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం…
◾️ఎస్ఎంసి చైర్మన్ నరేష్
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : మండలంలోని లెంకాలపల్లి గ్రామంలోనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఎస్ఎంసి చైర్మన్ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారనీ పాఠశాల తరగతిగది ముందు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేయడం జరిగిందని వారు తెలిపారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణంలో పసుపు కుంకుమ నిమ్మకాయలతో ఉండటాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.