పబ్లిక్ హిందుస్థాన్ , నల్లబెల్లి :
వేసవిలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ రాజారాం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సమీపంలో ఉన్న చెరువులు కుంటలు నిండుకుండలా ఉండడంచేత, విద్యార్థులకు ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం చెరువులు కుంటల వద్దకు ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి రాగానే బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో చెరువులలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పత్రికలలో చూస్తున్నామని, కావున గమనించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాజారాం కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on