రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడా : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం గుండాల గ్రామంలో మంగళవారం రోజూ నర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ హిమబిందు వైద్య శిబిరం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రము పరిధిలో గుండాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో భాగంగా 92 మందిని పరీక్షించారు.

ఈ సందర్భంగా ఇరవై ఎనిమిది మంది రక్త నమూనా లు సేకరించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత గురించి వ్యాధినిరోధక టీకాల గురించి సీజనల్ వ్యాధుల గురించి , గర్భవతులకు పౌష్టిక ఆహారం , గురించి వివరించారు. వైద్య సిబ్బంది రాథోడ్ కృష్ణ , హెల్త్ అసిస్టెంట్ జాదవ్ అర్జున్ , ఏఎన్ఎం రేణుక, ఆశ కార్యకర్త ముని బి, రమాదేవి, గంగామణి, సరోజ పాల్గొన్నారు