రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పురుగుల అన్నం పెడుతున్నారన్న వార్త తెలుసుకొని తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినిలు బలరాంతో రోజు పడే బాధలను పంచుకున్నారు.

పురుగుల అన్నం, తలుపులు లేని కిటికీలు, పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని మొరపెట్టుకున్నారు. రోజు తినే అన్నం,కూరలు బాగా లేకపోవడం వల్ల సరిగా భోజనం చేయలేక అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులందరూ బలరాం జాదవ్ గారికి దృష్టికి తీసుకురావడంతో బలరాం పేద విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులు వెంటనే విద్యార్థినుల సమస్యలను తీర్చాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.
