నిర్మల్ జడ్పి చైర్మన్ మామడ మండలం దిమ్మదుర్తి లో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు
రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ ( ఇంటర్నెట్ డెస్క్ ) :
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో సురేందర్ గౌడ్ తో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో జాయిన్ అయ్యారు. ఏళ్లుగా నిర్మల్ లో మంత్రి ఐకే రెడ్డి అవినీతి, కబ్జాల పాలనతో జనం విసిగి వేసారిపోయారని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి ఐకే రెడ్డి అవినీతి పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.