మంచిర్యాల, ఫిబ్రవరి 14 (రిపబ్లిక్ హిందుస్థాన్) :
హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మహత్య కు కారుకులైన శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యాకేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టుడెంట్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సాగర్ యాదవ్ డిమాండ్ చేశారు.ఈ సంధర్బంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడుతూ మార్కులు,ర్యాంకుల కోసం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విధ్యార్థులను తీవ్ర ఓత్తిడికి గురిచేస్తూ ఫలితాలే లక్ష్యంగా మానసిక వేదనకు గురిచేయడం బాదాకరం అని అన్నారు.కార్పోరేట్ కాళాశాలలో వారి లాభం కోసం తప్ప విద్యార్థుల సంక్షేమం పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారని,శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఇది మొదటి ఆత్మహత్య కాదని, ఇలా ప్రతి సంవత్సరం ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత విద్యార్థికి న్యాయం చేసేంతవరకు ఏఐఎస్ బి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం అని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఐఎస్ బి నాయకులు మనోహర్,ప్రశాంత్,రాకేష్ తదితరులు పాల్గోన్నారు.