Monday, April 14, 2025
Homeతెలంగాణఆదిలాబాద్జిల్లా పోలీస్ అధ్వర్యంలో లో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు

జిల్లా పోలీస్ అధ్వర్యంలో లో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను గుర్తుచేసుకుంటూ అక్టోబర్ 21 న *పోలీస్ అమరవీరుల దినోత్సవం* జరుపుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అదిలాబాద్ జిల్లా విద్యార్థులు అదిలాబాద్ పోలీస్ నిర్వహించే ఆన్‌లైన్ వ్యాస రచన పోటీలో( తెలుగు / ఉర్దూ / ఇంగ్లీషులో) పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది 2 విభాగాలలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.


మొదటి విభాగం లో
5 తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు “రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పౌరుల పాత్ర” అనే అంశం పై వ్యాస రచన పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

రెండవ విభాగంలో డిగ్రీ మరియు ఆపై విద్యార్థులకు “సైబర్ నేరాలను నిరోధించడంలో పౌరులు మరియు పోలీసుల పాత్ర”.
అనే అంశం పై వ్యాస రచన పోటీ ఉంటుందని తెలియజేశారు.


పోటీలో పాల్గొనే విద్యార్థులు…
మీ వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి క్రింది పద్దతిని(steps) అనుసరించాలీ.
1. మీ వ్యాసాన్ని సబ్మిట్ చేయటానికి ఈ క్రింది 👇లింక్‌పై క్లిక్ చేయండి.


https://forms.gle/y5kk13WkPQYvgfW16

2. మీ పేరు, తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి.

3. మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాల పరిమితి మించకుండా సమర్పించాలీ.

4. మీ వ్యాసాన్ని సమర్పించడానికి చివరి తేదీ 24-10-2022.

జిల్లా లో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ బహుమతి ప్రదానం చేస్తారు మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది.


జిల్లా స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలోనుండి ఉత్తమ మూడు వ్యాసాలను “రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు”గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?