*నేరేడుచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం*
రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ శివారులోని ఎన్టీఆర్ కాలనీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని రామాపురానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ మరియు కూతురు కావేరితో కలిసి మోటార్ సైకిల్ పై నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా, కూతురు కావేరికి తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.