ఐటిడిఎ పిఓ , ఎమ్మెల్యే ను కలిసిన పట్నపూర్ జిపి వాసులు
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్/ఉట్నూర్ : పట్నాపూర్ గ్రామపంచాయతి సమస్యల పరిష్కరానికి చోరువచుపలని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావ్ గారికి మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్ర ని కలిసి పట్నపూర్ వాసులు వినతి పత్రం సమర్పించారు. అసంపూర్తిగా ఉన్న పట్నాపూర్ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం మరియు సూర్దాపూర్ గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంద్రం శంకర్ మాజీ సర్పంచ్ తొడషం, గోపాల్ , దుర్వ విశ్వర్ రావు , ఆడేం పురుషోత్తం పాల్గొన్నారు