ఎలాంటి పత్రాలు లేని 40 వాహనాలు స్వాధీనం….
భారీగా కలప స్వాధీనం. …
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో ఉట్నూర్ ఏ ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందబస్తు మధ్య కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజామున అదిలాబాదు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఉట్నూర్ గారి అధ్వర్యంలో ఉట్నూర్ సబ్ డివజనల్ పోలీసు అధికారులతో కలిసి ఇచ్చోడ మండలం లోని గుండాల గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాలాలో చెప్పట్టిన తనికిలో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 40 మోటార్ సైకిల్ లను మరియు సుమారు ఒక రూ .66 వేల విలువ గల 70 అక్రమ టేకు దుంగలను స్వాదినపర్చుకున్నారు. పట్టుకున్న అక్రమ కలపను తదుపరి చర్య గురించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అందరూ తమ గ్రామంలో తమ చుట్టూ జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలపాల గురించి వెంటనే పోలీసులకు తెలియచేయాలని అన్నారు. వాహన దారులు విధిగా సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలి అని, ఎవరైనా చట్టానికి విరుద్దంగా కలప అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడును అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ , నార్నుర్ సిఐలు ఎం. నైలు, ఇచ్చోడ మరియు ప్రేమ్ కుమారు , ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్, నేరడిగొండ ఎస్సై సాయన్న , గుడిహాత్నుర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ , ఉట్నూర్ ఎస్ఐ మహేందర్, గాధిగూడ ఎస్ఐ ఇమ్రాన్ మరియు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.