Sunday, December 29, 2024
Homeతెలంగాణఆదిలాబాద్Breaking News : ఆదిలాబాద్ పట్టణంలో వ్యభిచార గృహాల పై దాడి

Breaking News : ఆదిలాబాద్ పట్టణంలో వ్యభిచార గృహాల పై దాడి


సిసిఎస్, ఆదిలాబాద్ పట్టణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్...

  • మూడు వ్యభిచార గృహాల పై దాడి.*
  • నిర్వాహకులు, విటులపై కేసులు నమోదు.*
  • బాధిత మహిళలకు పునరావాస ఏర్పాటుకు కృషి.

– ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సిసిఎస్ పోలీసులు మరియు పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డిఎస్పీ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణం మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, టీచర్స్ కాలనీ నందు అలాగే ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ నందు వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు, 9 మంది పురుషును అరెస్టు చేసినట్లు తెలియజేశారు.


*కేసు వివరాలు*
మూడు చోట్ల విడివిడిగా
న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు పట్టుబడ్డ నిందితులు.
1) హెచ్ వంశీకృష్ణ s/o గణేష్ ఫైనాన్స్ బిజినెస్ శాంతినగర్.
2) కే బాబాసాహెబ్ @ తరుణ్ s/o దత్తు, ఎన్జీవో కోఆర్డినేటర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ.
3) ఎస్ అశోక్ s/o గోవర్ధన్ శాంతినగర్.
4) కపిల్ (పరారి)

టీచర్స్ కాలనీ నందు పట్టుబడ్డ నిందితుల వివరాలు.
5) ఎన్ రవితేజ s/o బాపు టీచర్స్ కాలనీ.
6) కే విశాల్ s/o పురుషోత్తం, మన్నూర్ గుడిహత్నూర్.

విద్యానగర్ నందు పట్టుబడ్డ నిందితుల వివరాలు.
7) షేక్ సలీం s/o షేక్ అహ్మద్ హుస్సేన్ ఖురేషి గుడిహత్నూర్.
8) అద్నాన్ అహ్మద్ s/o అజాజ్ అహ్మద్,మహాలక్ష్మి వడ.
9) ఎండి అజీముద్దీన్ s/o ఎండి జరోరుద్దీన్, మహాలక్ష్మి వాడ.



మొత్తంగా ముగ్గురు మహిళలు, 9 మంది మగవారిపై మావల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 137 138 లతో మరియు ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో 166 తో అండర్ సెక్షన్ 3 , 4 , 5  ఎమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆక్ట్ – 1956 తో కేసులు నమోదు చేయబడినట్లు తెలియజేశారు. ముఖ్యంగా నిర్వాహకుడైన కే బాబా సాహెబ్ @ తరుణ్, శూర్ ఎన్జీవో ద్వారా నియమితుడై, హెచ్ఐవి పై అవగాహన పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమాయకులైన మహిళలను ఉచ్చులోకి లాగుతూ బలవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్జీవో ప్రతినిధులకు తరుణ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై నివేదికను పంపనున్నట్లు తెలియజేశారు. బాధిత మహిళలకు పునరావాస కల్పించే విధంగా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలైనా, వ్యవస్థీకృత నేరాలను నిర్వహించే వారినైన సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవనిజిల్లా ఎస్పీ గారు హెచ్చరించారని తెలియజేశారు . వీరి వద్ద నుండి రూ 7,500/- నగదు, 11 సెల్ ఫోన్లు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్, ఆదిలాబాద్ రెండో పట్టణ సీఐ అశోక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ వి విష్ణువర్ధన్, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?