హైదరాబాద్:జనవరి 13
రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు.
ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది.
10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగా పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయో ధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on