Tuesday, April 8, 2025
Homeక్రైమ్మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నెరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు 

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నెరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు 

–  శిక్ష మరియు 10 వేల రూపాయల జరిమానా

— నేరేడుచర్ల పిఎస్ పరిధిలో ఘటన, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నేరేడుచర్ల పోలీస్ 

— బాధితులను సాక్షులను విచారించి తీర్పు వెల్లడించిన ఒకటవ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు

రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : 

సంవత్సర కాలంలోనే కేసును విచారణ జరిపి సాక్షులను బాధితులను విచారించి నిందితునికి జైలు శిక్ష పడేలా కృషిచేసిన పోలీసు సిబ్బందిని సిబ్బందిని కోదాడ డిఎస్పి, హుజూర్నగర్ సిఐని, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్  అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. 

నేరేడుచర్ల మండల కేంద్రంలో 2022 సంవత్సరం జనవరి నెల 7వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన 27 సంవత్సరాల ఒంటిపులి కోటేశ్వర్ రావు ఘాతూకానికి పాల్పడినట్టు గుర్తించి నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నందు పోక్సో చట్టం 2012, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ప్రకారం నేరం సంఖ్య 10/2022 ప్రకారం నిందితుడి పై కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్  ఒక ప్రకటనలో తెలిపినారు. 

ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారులు అప్పటి కోదాడ డిఎస్పీ రఘు, నేరేడుచర్ల ఎస్ఐ నవీన్ కుమార్ విచారణ జరిపి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేయడం జరిగినదని తెలిపారు. 

దీనిపై పూర్తి సాక్షాదారాల ప్రకారం సాక్షులను, మరియు బాధితులను విచారించిన 1వ అదనపు సెషన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి  ప్రేమలత  నిందుతుడు వంటిపులి కోటేశ్వర్ రావు నేరానికి పాల్పడినాడు అని నిర్ధారించి నేరస్థునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 జరిమానా విధించడం జరిగినది. నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని ఎస్పీ  హెచ్చరించారు.

రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్న కోర్టు డ్యూటీ ఫంక్షనల్ వర్టికల్ ఆధారంగా సిబ్బంది సామర్థ్యంతో పనిచేసి అతి తక్కువ కాలంలోనే ఈ కేసును చేదించి నేరస్తునికి శిక్ష పడేలా కృషి చేయడం జరిగింది. అలాగే బాధితురాలికి న్యాయం చేయడం జరిగింది అని ఎస్పీ గారు. బాధితురాలిని బరోసా సెంటర్ నందు నైతికంగా, సామాజికంగా, మానసికంగా కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుండి 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందించడం జరిగిందని అన్నారు.

ఈ కేసులో బాగా పనిచేసిన కోదాడ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, సిఐ రామలింగారెడ్డి, నేరేడుచర్ల ఎస్సై నవీన్ కేమార్ ను, కోర్టు పిపి త్యాగరాజు మరియు కోర్టు డ్యూటీ సిబ్బందిని, నేరేడుచర్ల పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?