రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (మార్చ్4) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ సమావేశ మందిరంలో ఆర్ ఎమ్ పి,పి ఎమ్ పి అర్బన్ అండ్ టౌన్ అసోసియేషన్ సమావేశం పట్టణ అధ్యక్షులు మేడిపల్లి విజయ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్ పెంట రాజయ్య అతిథులుగా 36 వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న తమ సంఘానికి భవనం లేదు కావున సంఘ భవనానికి స్థలం కేటాయించాలని కోరగ వేదికపైన ఉన్న నాయకులు తప్పకుండ కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వివిధ వార్డుల కౌన్సిలర్లు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి సంఘం భవనం కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
చిత్రంలో ఆర్ఎంపీలకు సర్టిఫికెట్లను అందజేస్తున్న మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్ పెంట రాజయ్య
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు రాము చారి,జిల్లా కోశాధికారి రాజేందర్,పట్టణ అధ్యక్షుడు మేడిపల్లి విజయ్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఎమ్ రమేష్,కోశాధికారి రాథోడ్ రామారావు, గౌరవ అధ్యక్షుడు తిరుపతి,ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్,సలహాదారుడు శంకరయ్య,వెంకటరెడ్డి,కే శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి తిరుపతి,ఆర్గనైజింగ్ సెక్రటరీలు కుమారస్వామి,సాయికృష్ణ,రమేష్ చారి,డి ఎల్ స్వామి, సేస్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.