▪️పరీక్ష వేళ అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్..!?
▪️దేహ శుద్ధి చేసిన కుటుంబ సభ్యులు
▪️ కేసు పెట్టకుండా వెనుదిరిగిన కుటుంబ సభ్యులు
▪️ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
R.హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడమండలంలోని సాయి సామత్ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. డిగ్రీ పరీక్షలు నడుస్తున్న వేళ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడని కుటుంబ సభ్యులకు తెలపగా భారీ ఎత్తున కళాశాలకు చేరుకొని అధ్యాపకుడి దేహ శుద్ధి చేశారు. ఈ విషయం మీద సంభందిత కళాశాల సిబ్బందిని వివరణ కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా యాజమాన్యం వెనుతిరిగింది.. స్థానిక ఎస్సై ఉదయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం యాజమాన్యంతో వివరాలు తెలుసుకొని స్థానిక ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కి హుటాహుటిన తరలించారు. అదేవిధంగా కళాశాల యాజమాన్యంతో అసలు జరిగిన విషయం గురించి ఆరా తీస్తే పరీక్షలు నకలు నడిపించలేదని ఇన్విజిలేటర్ తో వాగ్వాదానికి దిగి కుటుంబ సభ్యులు,తోటి విద్యార్థులే గోడవని సృష్టించారని చాలా సులువుగా సమాధానం ఇస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.