రిపబ్లిక్ హిందుస్థాన్ , నిజామాబాద్ :
నిజామాబాద్ నగరంలోని స్టార్ వరల్డ్ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(DEO) ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ నిబంధనలకు కు విరుద్ధంగా పాఠశాలలోని పాఠ్యపుస్తకాలను విక్రయిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ జీవో నెంబర్ 1 ప్రకారం సరైన మౌలిక వసతులు లేకుండా వార్షిక విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులను డిస్ప్లే చేయకుండా ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.
స్టార్ వరల్డ్ పాఠశాల యాజమాన్యం పాఠ్యపుస్తకాలను తమ పాఠశాలలోనే కొనాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తూ అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారు ఇదేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే తమ వద్ద హై కోర్ట్ ఆర్డర్ ఉందని ఫేక్ ఆర్డర్ కాపీని సృష్టించి పుస్తకాలు విద్యార్థుల తల్లిదండ్రులు వేధిస్తున్నారని కావున ఎటువంటి నియమ నిబంధనలు పట్టించుకోకుండా అధికారులు సైతం తప్పుదారి పట్టిస్తు , విద్యను మరియు విద్యారంగాన్ని వ్యాపారం గా మారుతున్న స్టార్ వరల్డ్ యొక్క పాఠశాల గుర్తింపును రద్దు చేసి ఆ పాఠశాలను సీజ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.