రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాదు :
ఈ నెల 28 న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, బంజారా కమిటీ సభ్యులతో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సాంప్రదాయ పూజ కార్యక్రమాలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. షామియానాలు, బారికేడింగ్, భోజనం, మరుగుదొడ్లు, త్రాగునీరు, వైద్యసేవలు, సౌండ్ సిస్టం, తదితర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులకు కేటాయించడం జరిగిందని, సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి జయంతి వేడుకలను విజయవంతం చేయాలనీ ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్ బాస్ ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలు, వాహన పార్కింగ్ ల ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం నిర్వహించాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భు గుప్త, ఆర్డీఓ స్రవంతి, మైనారిటి సంక్షేమ అధికారి రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, బంజారా ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.