రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : తెలంగాణ రాష్ట్రం లో సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న పదవ తరగతి పరీక్షలు అందులో భాగంగా బజార్ హత్నూర్ మండలంలో జాతర్ల మరియు మోడల్ స్కూల్ బజార్ హత్నూర్ లోని పరీక్షలకు శనివారం రోజు అన్ని ఏర్పాట్లు చేసారు. జాతర్ల సెంటర్ నందు పరీక్ష నిర్వాహకురాలిగా బజార్ హత్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యూష, మరియు ఉపాద్యాయులు జియా ఉద్దీన్, మోడల్ స్కూల్ బజార్ హత్నూర్ నందు ఏ శ్రీనివాస్ మరియు నర్సయ్య నిర్వహించనున్నారు.
జాతర్ల నందు 140విద్యార్థులు
మోడల్ స్కూల్ నందు 240
మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు అని మండల విద్యా అధికారి శ్రీకాంత్ తెలియజేసారు. పరీక్షలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా రాయాలని విద్యార్థులను సూచించారు.
పరీక్షలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులు పెన్నులు కంపాస్ బాక్స్ పరీక్ష పాడ్ మాత్రమే తీసుకొని రావలసిందిగా సూచించారు. సెల్ఫోన్లకు అనుమతి లేదని
పరీక్ష సెంటర్లకు సమయానికి వెళ్లడానికి విద్యార్థులకు ఆర్టీసీ వారు టెంబి నుంచి జాతర్ల మీదుగా మోడల్ స్కూల్ వరకు బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష హాలుకు ఉదయం 8: 15 లోగా చేరుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసారు.