మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు….
రిపబ్లిక్ హిందుస్థాన్ , బజర్ హత్నుర్ : మండల కేంద్రం లోని మాడల్ పాఠశాలకు వెళ్ళే రోడ్డు ను బాగు చేయాలని విద్యార్థులు గురువారం కదం తొక్కారు.
తమకు రోడ్డు సరిగా లేదని నిత్యం పాఠశాలకు వెళ్ళాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని పాటశాల ప్రారంభం అయ్యిన నుండి నేటి వరకు పాటశాల రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని నిలదీశారు.
తమకు రోడ్డు సమస్యను పరిష్కరించాలని రోడ్డు పై బైఠాయించి తమ నిరసన వ్యక్త పరిచారు. విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నాయకులు చేరుకుని పరిష్కారం చుపెవరకు వెళ్ళేది లేదని పట్టు బట్టారు.
దీంతో వాహనాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం తో విషయం తెలుసుకున్న ఎస్సై అరుణ్ కుమార్ గారు పై అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడం తో ధర్నా ముగించారు.
వారం రోజులలో పరిష్కారం చూపని పక్షం లో మరింత ఉదృతంగా పోరాటం చేస్తామని తెలిపారు.

కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు గోసుల నాగరాజు, ఎంపిటిసి గజనంద్, pacs డైరెక్టర్ చట్ల వినల్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కేవల్ సింగ్, బిజెవైఎం జిల్లా నాయకుడు నగనాత్, గిరిజన మోర్చ నాయకులు చందు, సుంగన్న, సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్, విద్యార్థుల తల్లి దండ్రులు విఠల్, సుభాష్,రమేష్, గజనంద్, తదితరులు పాల్గొన్నారు.